నేను నగ్నంగా నటించలేదే.. అవును శింబు స్నేహం జీవితాంతం కావాలి: ఓవియా
90ఎమ్ఎల్ సినిమాతో ఓవియాపై విమర్శలు ఎక్కువైపోతున్నాయి. బిగ్ బాస్ సెన్సేషన్ ఓవియా.. తాజా చిత్రం 90ఎమ్ఎల్. ఈ చిత్రం అడల్డ్ కామెడీతో కూడిన టీజర్‌లో డబుల్ మీనింగ్ డైలాగులు, ఏ జోకులు, అశ్లీల దృశ్యాలు వంటివి చాలా వున్నాయి. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఓవియాకు కోపమొచ్చేసింది.
తాను నగ్నంగా నటించలేదే అని సమాధానమిచ్చింది. మహిళలు ఎలా నటించాలి. ఎలాంటి దుస్తులు వేయాలనే చట్టం లేదుగా.. ఈ చిత్రంలో గ్లామర్‌గా నటించానే కానీ.. అశ్లీలంగా కనిపించలేదని ఓవియా స్పష్టం చేశారు. తన లిమిట్స్ తనకు తెలుసునని.. తనను విమర్శించడాన్ని పక్కనబెట్టి.. వారి వారి పనులు చూసుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది.
ఇకపోతే.. తమిళ హీరో శింబుతో ఓవియా ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్-1 తమిళ సీజన్‌తో బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ సందర్భంగా శింబు ఓవియాకు సపోర్ట్ చేశాడు. ఇంకా తాజాగా ఓవియా నటించిన 90ఎమ్ఎల్‌లో శింబు అతిథి పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓవియా మాట్లాడింది.
ప్రేమ ఎప్పుడైనా.. ఎక్కడైనా పుట్టొచ్చు అని తెలిపింది. శింబు తనకు మంచి స్నేహితుడని చెప్పింది. తాను ఆయనతో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ వుంటానని చెప్పింది. ఆయన స్నేహం జీవితాంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.