మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:00 IST)

దత్తత తీసుకున్న పాపానికి.. ప్రేమికుడితో కలిసి ద్రోహం చేసింది..

దత్తత తీసుకున్న ఇంటికే తన ప్రేమికుడితో కలిసి ఎసరు పెట్టింది.. ఓ యువతి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కన్యాకుమారి సమీపంలో మూవాట్టుకోణం అనే ప్రాంతానికి చెందిన జయకుమారి.. తన భర్తను కోల్పోయింది. ఆమె ఒంటరిగా జీవిస్తోంది. జయకుమారి దంపతులకు సంతానం లేకపోవడంతో.. తనకు తోడు కావాలని శ్రీన (19) అనే యువతిని దత్తత తీసుకుంది. 
 
శ్రీనయ ఓ కాలేజీలో చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుని తిరిగివస్తానని చెప్పిన శ్రీనయ ఇంటికి చేరుకోలేదు. ఇంకా ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. అంతేగాకుండా.. ఇంట్లోని కోట్లాది విలువ చేసే పత్రాలు, బ్యాంక్ లాకర్ తాళాలు, సీక్రెట్ నెంబర్లు, పలు లక్షల విలువ గల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి.
 
దీన్ని గమనించిన జయకుమారి షాకైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో శ్రీనయ షాలూ (23) అనే యువకుడిని ప్రేమిస్తోందని.. అతడితో కలిసి తిరుగుతుందని తెలుసుకున్నారు. జయకుమారికి చెందిన నగలను బ్యాంకు లాకర్ నుంచి తీసుకుని మోసానికి పాల్పడిన శ్రీనయపై బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనయ, షాలూలను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్యాకుమారి ప్రాంతంలో పెను సంచలనానికి దారితీసింది.