శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:15 IST)

బైబిల్.. ఆ బాలుడి పట్ల శాపమైంది.. శవపేటికలో పెట్టి సజీవదహనం..?

అమెరికాలో బైబిల్ గురించి పెద్దగా పట్టించుకోలేదని ఓ బాలుడిని పొట్టనబెట్టుకున్నారు.. అతడి తల్లిదండ్రులు. బైబిల్ గురించి అందులోని ప్రవచనాల గురించి తెలుసుకోని పాపానికి ప్రాణాలతో వుండగానే సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టియా, ట్యూనా దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. 
 
ఆ బాలుడిని ఆ దంపతులు బైబిల్‌లోని ప్రవచనాలను చదవాలని వేధించేవారు. అయితే ఆ బాలుడు బైబిల్ ప్రవచనాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దీంతో తలపై కొట్టడం.. వాతలు పెట్టేవారు. ఇంకా బైబిల్ పట్ల ఆ బాలుడు అనాసక్తి చూపడంతో కిరాతకంగా ఆ బాలుడిని ఆ దంపతులు హతమార్చారు. శవపేటికలో ఆ బాలుడిని ప్రాణాలతో కాల్చేశారు.
 
ప్రాణాలతో వుండగానే బాలుడిని కిరాతకంగా హతమార్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఎథిన్ అనే ఆ బాలుడికి వారిద్దరూ తల్లిదండ్రులు కాదని.. దత్తత తీసుకుని పెంచారని తేలింది. ఫలితంగా ఈ మానవమృగాలకు కఠిన శిక్ష పడేలా చేయాలని శిశు సంక్షేమ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.