శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (16:22 IST)

అమెరికాలో ఫేక్ యూనివర్శిటీ.. వందలాది విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా

అమెరికాలో ఫేక్‌ యూనివర్సిటీలో విద్యార్థులుగా చేరి అక్రమంగా నివసిస్తున్న వందలాది విదేశీయులపై ట్రంప్ సర్కారు కొరడా విసిరింది. ఇందులో చాలా మంది తెలుగు వారు ఉండటం విశేషం. వీరిని విద్యార్థులుగా సూచిస్తూ అమెరికాలో నివసించేందుకు సహాయపడిన 8 మంది భారత దళారీలను కూడా అరెస్ట్ చేసారు. 
 
వీరికి గాలం వేసేందుకు ఫెడరల్ ఏజెంట్స్ మంచి పన్నాగమే పన్నారు డెట్రాయిట్‌లో ఫర్మింగ్టన్‌ యూనివర్సిటీ పేరుతో నకిలీ యూనివర్సిటీ ఒకదాన్ని ఏర్పాటు చేసారు. ఈ యూనివర్సిటీలో స్టాఫ్, ఇన్‌స్ట్రక్టర్లు లేరు. 
 
అసలు ఈ యూనివర్సిటీకి ఒక కర్రిక్యులమే లేదు. క్లాసులు కూడా జరగవు.  కాని 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఉన్నత విద్య పేరుతో నకిలీ ధ్రువపత్రాలతో అమెరికా వచ్చి వీరందరూ దానిలో ప్రవేశం పొంది వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. 
 
ఈ తతంగాన్నంతా క్షుణ్ణంగా పరిశీలించిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు పూర్తి సమాచారాన్ని ట్రంప్‌కి అందజేసారు. వీరికి ఆ యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించి దళారీలుగా వ్యవహరించిన వారు 8 మందీ భారతీయులే కావడం శోచనీయం.