1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Passenger punches flight attendant for not allowing use first class restroom, shocking visuals

ఫస్ట్ క్లాస్ బాత్రూమ్‌ని యూజ్ చేయొద్దు అన్న పాపానికి? (video)

flight
ఫస్ట్ క్లాస్ బాత్రూమ్‌ని ఉపయోగించడానికి అనుమతించలేదని ఒక ప్రయాణీకుడు విమాన సిబ్బందిపై ఓ వ్యక్తి చేజేసుకున్నాడు. అమెరికన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ 377లో మెక్సికోలోని శాన్ జోస్ డెల్ కాబో నుండి లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ఘటన జరిగింది.
 
ఈ ఘటనను ఓ ప్రయాణికుడు రికార్డు చేయడంతో ఇంటర్నెట్‌లో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో హవాయి షర్ట్ ధరించిన ఒక వ్యక్తి క్యాబిన్ క్రూ మెంబర్ వద్దకు వచ్చి, అతను వ్యతిరేక దిశలో నడుస్తున్నప్పుడు అతని మెడ వెనుక భాగంలో కొట్టడం చూడొచ్చు.
 
ఈ సంఘటన ఇతర ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటన అనంతరం నిందితుడిని సీటుపైనే నిలువరించారు. లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జనవరి నుంచి రూ.2750లకు పెన్షన్‌ను పెంచుతాం.. ఏపీ సీఎం జగన్