గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (08:16 IST)

సైరస్‌ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం ఎలా జరిగిందంటే..

Cyrus Mistry Car
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతడపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సమయంలో కారును ఓ లేడీ వైద్యురాలు నడుపుతున్నారు. రాంగ్ సైడ్‌లో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా, కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో కూర్చొన్న సైరస్ మిస్త్రీతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై మహారాష్ట్ర పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
"ప్రమాదం జరిగినపుడు కారును ముంబైకు చెందిన ప్రముక వైద్యురాలు అనహిత పండోలే 120 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతున్నారు. ముందు సీట్లో ఆమె భర్త డారియస్ పండోలే, వెనుక సీట్లో సైరస్ మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూర్చొన్నారు. 
 
ఈ కారు పాల్ఘాట్ జిల్లాలోన చరోటీ వద్ద అనహిత పండోలే రాంగ్ సైడ్ నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో 120 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్న వారి కారు మెర్సిడెజ్ బెంజ్ కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనపై సైరస్ మిస్త్రీతో పాటు వెనుక సీట్లో కూర్చొన్న జహంగీర్ పండోలే కూడా మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న అనహిత, ఆమె భర్త గాయాలతో బయటపడ్డారు" అని పోలీసులు వివరించారు.