మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మాజీ డ్రైవర్ హత్య కేసు : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు

anantha babu
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఏపీలోని అధికార పార్టీ వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోమారు చుక్కెదురైంది. 
 
హత్య కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను మూడోసారి కొట్టివేసింది. అయితే, తల్లి మరణంతో ఆయనకు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
నిజానికి ఆయన తల్లి మరణించడంతో కోర్టు మూడు రోజుల పాటు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ పొడగించాలంటూ అనంతబారు హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు సెప్టెంబరు 5వ తేదీ వరకు బెయిల్ పొడగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, బెయిల్ షరతులపై కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా పాటించాలని స్పష్టం చేసింది. ఇపుడు ఈ బెయిల్ ముగియనున్న నేపథ్యంలో ఆయన మరోమారు బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకోగా, రాజమండ్రి కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.