ఇంటి పని మనిషి గదికి వెళ్లి అలా తాకాను.. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుబెర్టి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై తరచూ లైంగిక సంబంధ వ్యాఖ్యలు చేయడం డ్యుటెర్టికి అలవాటే. గతంలోనూ తాను ఓ ఆస్ట్రేలియన్ మిషనరీని అత్యాచారం చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. హైస్కూల్‌లో ఉన్నపుడు ఓ పాస్టర్ దగ్గర తాను అంగీకరించిన తప్పును తాజాగా డ్యుటెర్టి బయటపెట్టారు.
తాజాగా తాను స్కూల్ చదివే వయస్సులో తన ఇంట పనిచేసే పని మనిషిని లైంగికంగా వేధించానని వ్యాఖ్యానించారు. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో తమ ఇంట్లో పని మనిషిగా వున్న మహిళ గదికి వెళ్లానని, ఆ సమయంలో ఆమె నిద్రిస్తుండగా ఆమె దగ్గరికి వెళ్లి అభ్యంతరకరంగా తాకాను. అయితే మెలకువ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు.
అయితే డ్యుబెర్టి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆయన వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, అత్యాచార యత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.