శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (09:26 IST)

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు నేడు పట్టాభిషేకం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందిన మాజీ మంత్రి కేటీఆర్‌కు సోమవారం పట్టాభిషేకం జరుగనుంది. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస శ్రేణులు పెద్దఎత్తున హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నాయి. ఈ పట్టాభిషేక కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరుగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక బసవతారకం ఆస్పత్రి నుంచి కేటీఆర్ ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. 
 
అనంతరం 11.56 గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తల నుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షిస్తున్నారు.