1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Superpowers Race to Put Nuclear Reactors on the Moon

చంద్రమండలంపై అణు రియాక్టర్ల నిర్మాణంపై దృష్టి

Beaver Moon 2025
చంద్రమండలంపై అణు రియాక్టర్ల నిర్మాణంపై  అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు సిద్ధమవుతున్నాయి. దీనికికారణం లేకపోలేదు. చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసే దిశగా ఆయా దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇందులోభాగంగా ఈ మూడు దేశాలు అణు రియాక్టర్ల ఏర్పాటుపై దృష్టిసారించాయి. భవిష్యత్తులో చంద్రుడిపై ఎక్కువ కాలం మునుషులు ఉండాలన్నా, అక్కడి వనరులను అన్వేషించాలన్నా విద్యుత్ కీలకం. అందుకే ఈ మూడు దేశాలు అణుశక్తిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. 
 
ఓ చిన్న అణు రియాక్టర్ తయారీకి కంపెనీల నుంచి ఆగస్టులో నాసా ప్రతిపాదనలు కోరినట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం (సౌత్ పోల్) సమీపంలో పనిచేసేలా దీన్ని రూపొందించనున్నారు. 2030 డిసెంబరు నాటికి ప్రయోగానికి సిద్ధం చేయాలన్నది లక్ష్యం. ఈ రియాక్టర్ 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఐదేళ్ల పాటు మాసవ జోక్యం లేకుండా పనిచేసేలా రూపొందించాలని భావిస్తున్నారు.
 
చైనా కూడా చంద్రుడిపై అణుశక్తిని ఉపయోగించే ప్రణాళికలతో ముందుకొస్తోంది. చైనాతో కలిసి రష్యా 'సెలీనా' పేరుతో రియాక్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. 2036 నాటికి దీన్ని సిద్ధం చేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 10 కిలోవాట్ల వరకు విద్యుత్ అందిస్తూ పదేళ్ల పాటు సొంతంగా పనిచేసేలా తయారు చేయనున్నారు. అయితే, ఈ అణు రియాక్టర్ల ఏర్పాటు అంత సులమైన విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దేశ పౌరులకు ఓటు హక్కును దూరం చేయడం రాజ్యాంగంపై దాడి : సుప్రీంకోర్టు జడ్జి