1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Twelve killed in explosion at Kabul mosque during Friday prayers

రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి.. 12 మంది మృతి

explosion
ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర కాబుల్లో రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘాన్ పోలీసులు తెలిపారు. మరో 15 మందికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ పేలుడులో ముస్లిం మతగురువు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ తెలిపారు.
 
మసీదులో ప్రార్థనలు ప్రారంభమయిన వెంటనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఈ బాంబు దాడికి తామే బాధ్యులం అంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. కానీ, మతగురువు లక్ష్యంగానే ఈ బాంబు దాడి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. 
 
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఒప్పందం జరిగింది.
About Writer
సెల్వి