బుధవారం, 11 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 12 జనవరి 2026 (12:28 IST)

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా బంధిస్తే పోలా... నోరు తెరిచిన ట్రంప్

Trump-putin
నియంతల వెన్నును ఎలా విరగ్గొట్టాలో అమెరికాకు బాగా తెలుసు. నెక్ట్స్ ఏం చేయాలో కూడా వారికి బాగా తెలుసు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పరోక్షంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశించి మాట్లాడారు. వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా బందీ చేసారో అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా బందీ చేస్తే పోలా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ మాటలకు ట్రంప్ నోరు నొక్కుకున్నారు. వెంటనే స్పందిస్తూ... పుతిన్‌తో కూర్చుని చక్కగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చు. రష్యాకు ఐరోపా దేశాలంటే అస్సలు భయం లేదు కానీ అమెరికా అంటే రష్యాకు గుండెల్లో దడ వస్తుంది. కనుక మేమిద్దరం ఒకరికొకరు సహకరించుకుంటాం. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంతకాలం జరగడం చాలా బాధగా వుంది. లక్షల్లో సైనికులు మరణిస్తున్నారు. త్వరగా యుద్ధానికి ఇరుదేశాలు స్వస్తిపలకాలి అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్.
 
అన్ని దేశాలు కలిసి అమెరికాను తంతాయేమో?
నాటో దేశాలు. అమెరికాతో సహా అగ్రరాజ్యాలుగా పేరున్న జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటలీతో సహా నాటో(NATO)లో ప్రస్తుతం 32 సభ్య దేశాలలో చాలా దేశాలు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి. నాటోలో అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, హంగేరి, ఐస్‌లాండ్, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాంటెనీగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, టర్కీలు ఉన్నాయి. ఐతే వెనెజులాపై దాడి చేసిన అమెరికా ఆ దేశ అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్యను చెరబట్టడాన్ని చాలా దేశాలు వ్యతిరేకించాయి. ఇదిలావుండగానే ఇప్పుడు ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ఆక్రమిస్తానంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై సభ్య దేశాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. నాటో దేశాలలోని డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్ ఇప్పటికే దీనిపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచాయి. సభ్యదేశాలు కానటువంటి రష్యా, చైనాలు కూడా అమెరికా చర్యలపై పళ్లు నూరుతున్నాయి.
 
వెనెజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇప్పుడు తన దృష్టిని మరో ప్రాంతంపై సారిస్తోంది. దీనికి నిదర్శనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ... మరో 20 రోజుల్లో గ్రీన్ ల్యాండ్ గురించి మాట్లాడుకుందామంటూ చెప్పడంతో ఇది కాస్తా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ మరింత ఘాటుగా స్పందించారు.
 
నాటో లోని సభ్యదేశంపై అలాంటి చర్యకు దిగితే నాటోకి బీటలు వారతాయంటూ హెచ్చరించారు. సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకట్ట వేసేందుకు 12 దేశాలు 1949లో నాటోను ఏర్పాటు చేసి అందులో సభ్యులయ్యాయి. ఆ తర్వాత వాటి సంఖ్య 30కి చేరింది. ఐతే ఇపుడు అమెరికా నాటోలో సభ్యదేశంగా వున్న డెన్మార్క్ దేశానికి చెందిన గ్రీన్ లాండ్ గురించి మాట్లాడటం చర్చకు దారి తీసింది.
 
ఒకవైపు డెన్మార్క్ ప్రధాని హెచ్చరించినా అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ సలహాదారు అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడారు. అసలు గ్రీన్ లాండ్ అనేది డెన్మార్క్ దేశానికి చెందినదని ఆధారాలు ఏమైనా వున్నాయా అంటూ ప్రశ్నించారు. దీనికితోడు ఆయన భార్య ఏకంగా గ్రీన్ లాండ్ మ్యాప్ పైన అమెరికా జాతీయ జెండాను పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది. వ్యవహారం చూస్తుంటే గ్రీన్ లాండ్ పైన అమెరికా దాడి చేసి ఆక్రమించే ప్రయత్నం చేస్తే అన్ని దేశాలు కలిసి అమెరికాను తంతాయేమోనన్న అనుమానం కలుగుతోంది.