1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Woman accidentally finds 2 needles embedded in her brain

మహిళ మెదడులో 2 సూదులు.. ఎలా చొచ్చుకెళ్లాయో తెలియదు..

Woman
మహిళ మెదడులోకి సూదులు చొచ్చుకుని వెళ్ళాయి. ఈ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌ జెంగ్జౌలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెకు గాయాలు తగలకపోయినప్పటికీ వైద్యులను సంప్రదించింది. వారు అన్ని టెస్టులు చేసి, సీటీస్కాన్ కూడా చేశారు. అయితే ఆ స్కాన్ రిపోర్టులో అసలు విషయం బయటపడింది.
 
ఆమె మెదడులో 4.9 మి.మీ. పొడవున్న 2 సూదులు కనిపించాయి. ఇది యాక్సిడెంట్ వల్ల జరిగిన ప్రమాదం కాదు. దీంతో షాక్‌కు గురైన వైద్యులు ఆమెను విచారించారు. కానీ తలకు సంబంధించిన గాయలు, ప్రమాదం, సర్జరీలు ఏమీ జరగలేదని చెప్పింది. 
 
చిన్నప్పుడు జుహు తల్లిదండ్రులు యాత్రలకు వెళ్లేటప్పుడు తనని తన పిన్ని ఇంట్లో వదిలేసి వెళ్లేవారట. అప్పుడు పిన్ని జుహు తల మీద రెండు మచ్చలు చూసినట్లు చెప్పిందని జుహు తల్లిదండ్రులు వైద్యులకు వెల్లడించారు. ఇప్పుడు తలమీద గాయలు, మచ్చలు వంటివేం కనిపించకపోయేసరికి వైద్యులకు ఏం అర్థం కాలేదు. ఈ సూదులు ఇలానే ఉంటే ప్రమాదం వెంటనే సర్జరీ చేసి తొలిగించాలని వైద్యులు వెల్లడించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తెలంగాణలో కరోనావైరస్ కలకలం, కొత్తగా 2,239 పాజిటివ్ కేసులు