సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:43 IST)

భారత్‌లో కరోనా దూకుడు, కొత్తగా 85,362 పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 59 లక్షల 03 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 85,362 కేసులు నమోదు కాగా 1089 మంది కరోనాతో పోరాడి మరణించారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 93,420 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 59,03,933 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,60,969 ఉండగా 48,49,584 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 93,379 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 82.14 శాతంగా ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో 1.58 శాతానికి తగ్గిన మరణాల రేటు. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 16.28 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,41,535 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.ఇప్పటి వరకు దేశంలో 7,02,69,975 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.