గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (13:33 IST)

ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

ఉత్తరప్రదేశ్‌లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది కరోనా బాధితురాలు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ మెడికల్‌ కళాశాలలో చోటుచేసుకుంది. నవజాతి శిశువుల్లో ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని, నాలుగో శిశువుని వెంటిలేటర్‌పై ఉంచినట్లు వైద్యులు వివరించారు. 
 
అలాగే నలుగురికి జన్మనిచ్చిన తల్లి కూడా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే నెలలు నిండకముందే డెలివరీ అయినట్లు వైద్యులు చెప్పారు. నలుగురు చిన్నారులు 900 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
 
ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ గణేష్‌ తెలిపారు. నలుగురు పిల్లల నుంచి శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షల కోసం మైక్రో బయోలజీ డిపార్టుమెంట్‌కు పంపినట్లు తెలిపారు. 
 
కాగా, దేవరియా జిల్లాలోని గౌరీ బజార్‌లో ఉంటున్న 26 మహిళ మంగళవారం రాత్రి మెడికల్‌ కాలేజీలోని ట్రామా సెంటర్‌లో కరోనా పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. మహిళ డెలివరికి ఉండటంతో వైద్య బృందం మెరుగైన చికిత్స అందించారు. బుధవారం నలుగురు పిల్లలకు జన్మనించ్చిందని ఆయన తెలిపారు.