శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:22 IST)

అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం.. ఒమన్ ప్రకటన

అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో ఆరు నెలలుగా ఒమన్ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. 
 
కరోనా వైరస్ నుండి దేశాన్ని, విమానయాన సిబ్బందిని రక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒమన్ విమానయాన శాఖ పేర్కొంది. అలాగే దేశ రాజధాని మస్కట్, సలాహ్ నగరం మధ్య దేశీయ విమానాలను కూడా అదే రోజు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 
 
వాలిడ్ వీసాలు ఉన్న నివాసితులకు ఒమన్ తిరిగి రావడానికి విదేశాంగ శాఖ అనుమతి అవసరం లేదని అధికారులు తెలిపారు. చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసాలు కలిగి ఉన్న ప్రవాసులు అక్టోబర్ 1 నుండి మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే సుల్తానేట్‌కు తిరిగి రావచ్చని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హర్తి తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఒమన్ ఎయిర్ అధికారులు మాట్లాడుతూ ప్రయాణికులకు పూర్తి రక్షణతో సర్వీసులు నడుపుతామని తెలిపారు. ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.