గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (15:11 IST)

పానీ పూరీలను గప్ చుప్‌తో మింగింది.. అంతే ఆమె ప్రాణాలు పోయాయి...!

పానీ పూరీలంటే చాలామందికి తెగ ఇష్టం. ఇంకా పానీకి ఇచ్చే చింతపండు నీళ్లు లేకుండా పానీలు నోట్లోకి దిగవు. అయితే చిన్న చిన్న డొల్ల పూరీలో చింతపండు నీరు అంటే గప్ చుప్ అనే దాన్ని నింపుకుని గుటుక్కున మింగేస్తుంటారు. చాలామంది.

అయితే అదే ప్రస్తుతం ఓ మహిళ ప్రాణాలు తీసింది. పూరీలో గప్ చుప్‌ను నింపి నోట్లో వేసుకున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. తొందరపాటు చర్య ప్రాణాల మీదకు వచ్చింది. ఈ ఘటన భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సుందరగడ్‌ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్‌ పరిధి సరఫ్‌గడ్‌ గ్రామంలో  స్థానికురాలైన ఫూలమతి కిషాన్‌ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్‌చుప్‌ ఆమె గొంతు గుండా శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది.

భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్‌చుప్‌ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు.