సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:29 IST)

ఆహారంలో కలిపి మొలకలు తీసుకుంటే...

చాలామంది ఉదయాన్నే మొలకెత్తిన గింజలను ఆరగిస్తుంటారు. ఇది మంచి అలవాటే. కానీ, ఈ మొలకలను ఆహారం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. 
 
వాస్తవానికి స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్య పోషణ మెరుగుపడుతుంది. అదేవీటిని మనం తీసుకునే రోజువారి ఆహారంలో కలిపి తీసుకున్నట్టయితే మరింత మేలు కలుగుతుందట. విత్తనాన్ని మొలకెత్తిస్తే దానిలోని ఎంజైములు చైతన్యవంతమై ఎన్నో మార్పులను తీసుకువచ్చి గింజలోని పోషకాలు మన శరీరానికి సులభంగా లభ్యమయ్యే రూపంలోకి మార్చటమే గాక కొన్ని పోషకాలను సృష్టిస్తాయి. 
 
ఆహారంలో సాధారణంగా వాడే ధాన్యాలు, పప్పులను, మొలకెత్తిస్తే వాటిలోని పోషక విలువలు ఎక్కువగా వుంటాయి. పప్పులు, ధాన్యలలో మాంసకృత్తులు వుంటాయి. మొలకెత్తినప్పుడు నీటిలోని మాంసకృత్తులలో మార్పువచ్చి నాణ్యత పెరుగుతుంది. 
 
మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా విభజంచబడి అత్యవసర ఆమైనో ఆమ్లాల నిష్పత్తిలో ఉపయోగకరమైన మార్పు వస్తుంది. ఈ విధంగా మాంసకృత్తులు శరీరంలో సులభంగా జీర్ణమై శరీర పోషణకు తోడ్పడతాయి.