హైదరాబాదులో ఓ మహిళ దారుణ హత్య.. ఏం జరిగింది..?
హైదరాబాదులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ, దత్తునగర్‌లో బుధవారం సాయంత్రం 35 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. తమిళనాడుకు చెందిన ఈ మహిళ, తన భర్త అరుణ్ కుమార్, పిల్లలతో కలిసి గత నాలుగేళ్లుగా శ్రీ లక్ష్మి రెసిడెన్సీలోని మూడవ అంతస్తులో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
ఆమె భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, వారి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు ఫోన్ ద్వారా తమ తండ్రికి సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మీర్‌పేట పోలీసులు పరిశీలన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

