1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. bsnl 149 plan offers daily 4gb data in fifa world cup plan against jio 149 plan

FIFAWorldCup2018 ఆఫర్ .. రూ.149 ప్లాన్‌తో రోజుకు 4 జిబి డేటా

ప్రతిష్టాత్మక సాకర్ పోటీలను పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తాజాగా ఓ సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.149 ధరతో ఈ ప్లాన్‌ను ప్రకటించింది.

bsnl
ప్రతిష్టాత్మక సాకర్ పోటీలను పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తాజాగా ఓ సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.149 ధరతో ఈ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద తీసుకున్నవారికి 4జీబీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇదే తరహా రిలయన్స్ జియో కూడా తమ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే.
 
'ఫిఫా వరల్డ్‌ కప్‌ స్పెషల్‌ డేటా ఎస్‌టివి 149' పేరుతో సంస్థ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రోజుకు 4జీబీ 3జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే ఎస్‌టివి 149తో రీచార్జ్‌ చేసుకుంటే ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు వర్తించవని అన్ని బీఎస్ఎన్ఎల్ సర్కిల్స్‌లో అందుబాటులోకి ఉంటుంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హీరోయిన్ల ఫోటోలు.. రేటు కార్డులతో ఎస్కార్ట్ సర్వీస్.. మాజీ ప్రిన్సిపాల్ వక్రబుద్ధి