రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. అపరిమిత వాయిస్ కాల్స్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలన్నీ పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎ

selvi| Last Updated: ఆదివారం, 3 జూన్ 2018 (17:16 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలన్నీ పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అదనంగా అపరిమిత వాయిస్ కాల్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 
 
రూ.249 ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ పరిధిలో కాల్స్‌ చేసుకునే అవకాశం ఉండగా, రూ.645 అంత కంటే ఎక్కువ ప్లాన్‌లో ఉన్న వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 
 
ఇక ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. జూన్ 1 నుంచే ఈ ఆఫర్ అమల్లోకి వచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అలాగే రూ.249 నుంచి రూ.645 ప్లాన్స్ మధ్య ఏ ప్లాన్‌లో ఉన్న వినియోగదారులకైనా ఈ ఆఫర్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ వివరించింది.దీనిపై మరింత చదవండి :