జియోకు పోటీ.. బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.448 కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా ఆఫర్లు ప్రకటించేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా జియోకు పోటీగా కొత్త ప్లాన్స్ ప్ర

bsnl
selvi| Last Updated: బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (19:13 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా ఆఫర్లు ప్రకటించేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా జియోకు పోటీగా కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రిలయన్స్ జియోకి పోటీకి బీఎస్ఎన్ఎల్ రూ.448ల కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.

ఈ ప్లాన్ ద్వారా అపరిమిత నేషనల్, రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకి 100 ఎస్సెమ్మెస్‌లను పొందవచ్చునని సంస్థ ప్రకటించింది. ఇంకా 3జీ సెట్ నెట్ వర్క్ వేగంతో రోజుకీ 1జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. ఈ ప్లాన్ వాలీడిటీ 84రోజులని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.

ఇటీవలే బీఎస్ఎన్ఎల్ ''మ్యాక్సిమమ్'' ఆఫర్ పేరిట రూ.999తో రీఛార్జ్‌తో ఏడాది పాటు రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చునని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. జియోకు పోటీగా ఈ ఏడాది ఆఖరుకల్లా రూ.25వేల కోట్ల వ్యయంతో 4జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టేందుకు బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టింది.దీనిపై మరింత చదవండి :