మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (20:20 IST)

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.... రూ.999కు డేటా ఉచితం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.999కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు ఏడాది పాటు అన

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.999కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ మొబైల్ డేటా లభిస్తుంది. అలాగే 181 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. 
 
జమ్మూకాశ్మీర్, అస్సాం, ఈశాన్య భారత రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కస్టమర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1జీబీ వరకు మొబైల్ డేటా మాత్రమే ఉచితంగా లభిస్తుంది. అంటే మొత్తం ఏడాదికి కలిపి రోజుకు 1 జీబీ డేటా చొప్పున మొత్తం 365 జీబీ డేటా ఈ ప్లాన్ ద్వారా వస్తుందన్నమాట.