సంబంధిత వార్తలు
- అవాంఛిత వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదుకు ఆప్షన్.. తొలి టెలికాం సంస్థగా బీఎస్ఎన్ఎల్
- బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం.. 4జీ మొబైల్స్ తయారీ కోసం ఒప్పందం
- జియో - ఎయిర్‌టెల్‌కు షాకిస్తూ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్...
- బుడమేరుపై రిటైనింగ్‌వాల్ నిర్మించనున్నాం.. మంత్రి నారాయణ
- వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్ - త్వరలో 5జీ సేవలు ప్రారంభం
బీఎస్ఎన్ఎల్ ఫెస్టివల్ ఆఫర్స్.. రూ.500 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే?
పబ్లిక్ సెక్టార్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కోసం ఫెస్టివల్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ 24వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ తన కస్టమర్లకు అత్యుత్తమ ఆఫర్లను అందిస్తోంది. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ రూ.500 కంటే ఎక్కువ రీఛార్జ్‌ల కోసం 24 జీబీ అదనపు డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 499 అతి చిన్న ప్లాన్‌ను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రూ.100 తగ్గి రూ.399కి చేరుకుంది. కానీ ఈ మూడు నెలల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ రూ.499 వసూలు చేస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ 3300 జీబీ వరకు వినియోగానికి 60 ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ సంస్థ రూ. 107 ప్లాన్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని వాలిడిటీ 50 రోజులు! 3 జీబీ వరకు డేటాని పొందొచ్చు. 200 మినిట్స్ వాయిస్ కాల్స్ ఫ్రీ. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌లో ఎస్ఎంఎస్లు ఉచితంగా లభించడం లేదు. ఎస్ఎంఎస్ చేస్తే ఖర్చు అవుతుంది. ఇతర బెనిఫిట్స్ ఏం లేవు.
