బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (11:57 IST)

చెన్నైలో కుంభవృష్టి.. అక్టోబర్ 17వరకు బలమైన గాలులు

Chennai
Chennai
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా చెన్నై సహా పరిసర జిల్లాల్లో రెండ్రోజుల్నించి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 
 
ఇప్పటికే చెన్నై సహా పరిసర జిల్లాల్లో స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించారు. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో విమానాలు, రైళ్లు రద్దు చేశారు. 
 
రేపటి వరకూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా అన్నీ క్లోజ్ అయ్యాయి. అటు పుదుచ్చేరిలో కూడా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. 
 
అక్టోబర్ 17 వరకు పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీ తీరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి.