అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం.. వదిలిపెట్టేదే లేదు.. మంత్రి అనిత (video)
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కుటుంబసభ్యులను కత్తులతో బెదిరించి అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. వాచ్ మెన్, కొడుకును కత్తులతో బెదిరించి ఆయన భార్య, కొడుకు భార్యపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
పవిత్రమైన దసరా పండుగ రోజున ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి స్పందించారు. సత్యసాయిజిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారఘటన బాధాకరమన్నారు.
ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నామని, 48 గంటల్లో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. మహిళ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఒక్కో నిందితుడిపై 30 వరకు క్రిమినల్ కేసులున్నాయని చెప్పారు.