గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (11:26 IST)

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం- ఏపీ వాసులు మృతి

road accident
అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహ‌నాలు ఒక‌దానొక‌టి ఢీకొన‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి. 
 
అమెరికాలోని రాండాల్ఫ్ స‌మీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు ప్ర‌వాస భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. 
 
మృతుల్లో ఓ మ‌హిళ కూడా ఉన్నారు. ముగ్గురు తెలుగు వారు ఏపీలోని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వాసులు. ఇద్దరు శ్రీకాళహస్తికి చెందిన వారు కాగా.. ఒకరు గూడురుకు చెందినవారున్నారు. మృతులు గోపి తిరుమూరు, రజినేని చిరంజీవి శివ, హరితారెడ్డి డేగపూడిగా గుర్తించారు.