గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (09:08 IST)

పులి మీద కూర్చొని స్వారీ చేసిన వ్యక్తి.. పాత వీడియో వైరల్

Tiger
Tiger
పులి మీద కూర్చొని ఓ వ్యక్తి స్వారీ చేస్తున్న షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి. సవారీ చేసిన వ్యక్తి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నౌమన్ హసన్ అని సమాచారం. 
 
ఈ వీడియోలో పులికి గొలుసు కట్టి కాసేపు నడిచాడు. ఆ తర్వాత పులిపై కూర్చున్నాడు. కానీ ఎక్కువ సేపు కూర్చోలేకపోయాడు. బ్యాలెన్స్ ఆపలేక కిందికి జారిపోయాడు. 
 
వీడియోను గతంలోనే షేర్‌ చేసిన హసన్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీడియోకి లక్షల సంఖ్యలో వ్యూస్ సాధించింది. హసన్ పులి మీద స్వారీ చేయడం పట్ల పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.