మహిళల టి 20 ప్రపంచ కప్-భారత్ ఇంటికి.. కివీస్ రికార్డ్
మహిళల టి 20 ప్రపంచ కప్‌లో భాగంగా 2016 తర్వాత తొలిసారిగా సెమీఫైనల్‌కు చేరుకోవడానికి సోమవారం పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా కివీస్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. దాంతో 2016 తర్వాత కివీస్ తొలిసారి సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నట్టయింది. ఇక ఇప్పటికే భారత్ మహిళల టి 20 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది.
అయితే సోమవారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులకే పరిమితం చేసి బలంగా నిలిచింది.. పాకిస్థాన్. అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ దారుణంగా కుప్పకూలడంతో కేవలం 11.4 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది.
ఇక సెమీస్‌కు అర్హత సాధించేందుకు పాకిస్థాన్ 12 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. 11.4 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లు రాణించడంతో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. ఏకంగా నలుగురు డకౌట్ అయ్యారు.
కివీస్ బౌలర్లలో స్పిన్నర్ అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్టగా, ఈడెన్ కార్సన్ 2, లీ తహుహు ఒక వికెట్ తీశారు. ఇక ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్లతో ఈ సిరీస్ పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తమ టోర్నమెంట్ ఓపెనర్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్‌కు చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కలేదు.