బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 13 అక్టోబరు 2024 (22:07 IST)

యూపిఐ ఉపయోగించి భారతదేశములో పేరు ధృవీకరణను ప్రారంభించిన ట్రూకాలర్

True caller
భారతదేశములోని ప్రీమియం యూజర్స్ అందరికి ట్రూకాలర్ బ్లూ టిక్ ధృవీకరణను ప్రారంభించింది. యూజర్స్ వారి సరైన పేర్లను ధృవీకరించుటకు ప్రభుత్వ-మద్ధతు ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపిఐ) ద్వారా తమ గుర్తింపును ధృవపరచుటకు కొత్త వెరిఫైడ్ బ్యాడ్జ్ సర్వీస్ వీలుకలిగిస్తుంది.
 
కొన్ని సంవత్సరాలుగా, వెరిఫైడ్ బ్యాడ్జ్ అనేది ట్రూకాలర్ యూజర్స్‌లో ఎంతగానో ఎదురుచూడబడుతున్న ఫీచర్స్‌లో ఒకటిగా నిలిచింది. చాలామంది యూజర్స్ దీనిని పొందుటకు మరింత పారదర్శకమైన, యాక్సెసిబుల్ విధానాన్ని కోరుకుంటున్నారు. ఈ అత్యధిక డిమాండ్‌కు స్పందనగా, మరింత ఖచ్ఛితమైన, నమ్మదగిన పరిష్కారాన్ని అందించుటకు ట్రూకాలర్ ధృవీకరణ ప్రక్రియను పునరుద్ధరించింది.
 
కొత్త వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపిఐ) ద్వారా బాహ్య ధృవీకరణ వీలు కలిగిస్తుంది, తద్వారా ప్రధాన ఆర్ధిక సంస్థలు నియోగించే అవే విశ్వసనీయమైన పద్ధతులను ఉపయోగించి యూజర్స్ గుర్తింపులు ప్రామాణీకరించబడతాయని నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా యూజర్స్ యూపిఐ నుండి అందుకున్న సమాచారము ఆధారంగా వారు డిస్ప్లే కావాలని అనుకుంటున్న పేరును ఎంచుకొని ధృవీకరణను తమకు తామే ప్రారంభించవచ్చు.
 
ఈ కొత్త ఫీచర్ ప్రారంభము గురించి మాట్లాడుతూ, రిషిత్ ఝున్‎ఝున్‎వాలా, చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్- ఎండి, ఇండియా, ట్రూకాలర్ ఇలా అన్నారు, “కొత్త వెరిఫైడ్ బ్యాడ్జ్ తమ గుర్తింపులను ఏర్పరచుకొనుటకు ధృఢమైన, నమ్మకమైన విధానాలను కోరుకునే మా పీమియం యూజర్స్ నుండి వచ్చిన ఫీడ్‎బ్యాక్‌కు ప్రత్యక్ష స్పందన. యూపిఐ-ఆధారిత ధృవీకరణను ఏకీకృతం చేయడం ద్వారా, మేము మా ప్లాట్ఫార్మ్ పైన ఉన్న గుర్తింపులు ప్రామాణికమైనవి, విశ్వసనీయమైనవని నిర్ధారించుటకు ఎక్కువగా అంగీకరించబడే, సురక్షితమైన విధానాన్ని మేము అందిస్తున్నాము.
 
ఈ ఫీచర్ ఉత్తమ-శ్రేణి సర్వీసులను అందించడమే కాకుండా యూజర్స్ తమ డిజిటల్ ఉనికిని ధైర్యంగా నియంత్రించుకునే సాధికారతను కూడా అందించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. కమ్యూనికేషన్ అందరికి సురక్షితమైనదిగా చేయాలనే మా కలను సాకారం చేసుకొనుటలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని మేము నమ్ముతున్నాము. ఇది భారతదేశములో ప్రారంభించబడుతోంది కాని తొందరలోనే ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుంది. ఈ ప్రారంభముతో, ట్రూకాలర్ ప్రపంచవ్యాప్తంగా యూజర్ ప్రొఫైల్స్ యొక్క అత్యంత విశ్వసనీయమైన ఐడెంటిఫైయ్యర్ అవుతుంది."
 
వెరిఫైడ్ బ్యాడ్జ్ పరిచయంతో, యూజర్స్‌కు సంప్రదాయిక ఐడీలతో పోల్చదగిన గుర్తింపు, విశ్వసనీయతలను అందిస్తూ, పో ట్రూకాలర్ డిజిటల్ కమ్యూనికేషన్స్‌లో నమ్మకాంకి ఒక కొత్త ప్రమాణాన్ని ఏర్పరచింది. ఈ మార్పు డిజిటల్ ఇంటరాక్షన్ల సురక్షత, విశ్వసనీయతలను పెంచాలనే ట్రూకాలర్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. వెరిఫైడ్ బ్యాడ్జ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ పై ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని దయచేసి గమనించండి. iPhone పైన వెరిఫైడ్ బ్యాడ్జ్ కొరకు సపోర్ట్ తొందరలోనే రాబోతోంది.