బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (14:56 IST)

2024లో రూ.4 లక్షల కోట్లు ఆదాయం పెరిగిన గౌతం ఆదానీ

Adani
దేశంలోని పారిశ్రామిక దిగ్గజాల్లో గౌతం ఆదానీ ఒకరు. ప్రస్తుత యేడాదిలో ఆయన అత్యధికంగా ఆదాయాన్ని అర్జించారు. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో హయ్యెస్ట్ వెల్త్ గెయినర్స్ జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. 2024లో గౌతం ఆదానీ సంపద ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్లు) మేరకు పెరిగింది. 
 
గత యేడాది కంటే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఒక సంవత్సరంలో ఒక భారతీయుడు ఆర్జించిన అత్యధిక సంపద కూడా ఇదే కావడం గమనామర్హం. ఈ యేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓపీ జిందాల్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ సావిత్రి జిందాల్ల ఉమ్మడి సంపద పెరుగుదల కంటే ఎక్కువగా గౌతమ్ అదానీ ఆర్జించడం గమనార్హం. దీంతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ సంపద 116 బిలియన్ డాలర్లకు చేరింది.
 
ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో ఈ యేడాది అత్యధిక సంపద పొందిన వ్యక్తుల జాబితాలో అదానీ తర్వాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. 2024లో ఆయన సంపద 27.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో అతడి నికర ఆస్తి విలువ 119.5 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతం అదానీతో పోల్చితే 3.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువ సంపదను కలిగివున్నారు.