మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:52 IST)

ఈ యేడాది భారీగా పెరిగిన ముఖేశ్ అంబానీ సంపద... మొత్తం ఆస్తి విలువ రూ.9.68 లక్షల కోట్లు!!

mukesh ambani
రిలయన్స్ అధినేత ముఖేషశ్ అంబానీ ఆస్తులు ఈ యేడాది మరింతగా పెరిగాయి. దీంతో భారతదేశంలోనే అత్యంత సంపన్నడుగా నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఆయన భారత్‌లోని కోటీశ్వరుల్లో మొదటిస్థానంలో నిలించారు. అలాగే, ఆసియాలోనూ ఆయన అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం ముఖేశ్ అంబానీ సంపద విలువ రూ.9.68 లక్షల కోట్లుగా ఉందన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. గత యేడాది ఆయన ఆస్తి విలువ రూ.6.92 లక్షల కోట్లుగా ఉండగా, ఈ యేడాదికి అది మరింతగా పెరిగింది. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. 
 
భారత్‌లో ముఖేశ్ అంబానీ తర్వాత స్థానాల్లో అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ రూ.7 లక్షల ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. అలాగే, హెచ్.సి.ఎల్ అధినేత శివనాడార్ రూ.3 లక్షల కోట్లు, సావిత్రి జిందాల్ రూ.2.79 కోట్లు, దిలీప్ సంఘ్వి రూ.2.22 లక్షల కోట్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలించారు. కాగా, భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య బాగా పెరిగిందని, ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2023లో భారత్‌లో ఈ బిలియనీర్ల సంఖ్య 169గా ఉండగా, ఇపుడు అది 200కు పెరిగినట్టు పేర్కొంది.