సంబంధిత వార్తలు
- నేల టికెట్ బ్యాచ్.. కసి తీరకపోతే శవాన్ని లేపి చంపుతా : బాలకృష్ణ (Trailer)
- గూగుల్ నుంచి ''ఆండ్రాయిడ్ ఓ''... ఆగస్టు 21న ఆవిష్కరణ?
- తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లోనూ గూగుల్ వాయిస్ సెర్చ్ సేవలు
- గూగుల్ ప్లే స్టోర్‌లో "మై జియో యాప్" కొత్త రికార్డు- ఏడాదిలో పది కోట్లమంది డౌన్లోడ్ చేసుకున్నారట..!
- అమ్మాయిలు కావాలంటున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
21న 'ఆండ్రాయిడ్ ఓ (O) 8.0' రిలీజ్'... ఫీచర్లు ఏంటంటే...
స్మార్ట్ ఫోన్ యూజర్లతో పాటు నెటిజన్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఓ (O) 8.0' ఈ నెల 21వ తేదీ సోమవారం విడుదల కానుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటి
స్మార్ట్ ఫోన్ యూజర్లతో పాటు నెటిజన్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఓ (O) 8.0' ఈ నెల 21వ తేదీ సోమవారం విడుదల కానుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఆగస్టు 21వ తేదీన మధ్యాహ్నం 2.40 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 22వ తేదీన రాత్రి 12.10 గంటలకు) ఆండ్రాయిడ్ ఓ గురించి ప్రకటన చేయనున్నారు. అదేసమయంలో ఆండ్రాయిడ్ ఓ (O)లో రానున్న ఫీచర్లను వెల్లడించడంతోపాటు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరును కూడా గూగుల్ ప్రకటించనుంది.
న్యూయార్క్ సిటీలో జరగనున్న ఓ ఈవెంట్‌లో గూగుల్ తన కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 8.0 గురించిన ప్రకటన చేయనుంది. ఆగస్టు 21వ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆండ్రాయిడ్ 'ఓ'ను విడుదల చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ఈ ఈవెంట్‌ను లైవ్‌లో వీక్షించాలంటే android.com/o సైట్‌ను సందర్శించవచ్చని గూగుల్ తెలియజేసింది.
