శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (16:26 IST)

నంద్యాల బైపోల్‌లో టీడీపీని బహిష్కరించండి... భూమా అఖిల పిలుపు?

తన తండ్రి భూమా నాగిరెడ్డి ఆత్మక్షోభించేలా తమ బద్ధశత్రువు గంగుల ప్రతాపరెడ్డిని తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డి తీవ్ర మనస్థాపానికి లోనైనట్టు తెలుస్తోంది. ద

తన తండ్రి భూమా నాగిరెడ్డి ఆత్మక్షోభించేలా తమ బద్ధశత్రువు గంగుల ప్రతాపరెడ్డిని తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డి తీవ్ర మనస్థాపానికి లోనైనట్టు తెలుస్తోంది. దీంతో ఆమె తన మనోవేదనను వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసినట్టు సమాచారం. ఈనెల 17వ తేదీన సాయంత్రం 5.14 నిమిషాలకు ఈ పోస్ట్ చేయగా, ఇపుడు ఇది ఆ ఖాతాలో కనిపించక పోవడం గమనార్హం. అఖిల భూమా ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ ఉంది. ఈ పోస్ట్‌లో...
 
"చంద్రబాబు నాయుడిని నమ్మడం నా మతిలేని తనం. గంగులను పార్టీలోకి రానిచ్చి ఆయన మా నాన్నగారు స్వర్గీయ భూమా నాగిరెడ్డికి నమ్మక ద్రోహం చేశారు. ఎన్నికల కోసం మా కుటుంబాన్ని వాడుకుందామని చూశారు. ఇకపై నేను టీడీపీకి ప్రచారం చేయనని మా నాన్నగారి సాక్షిగా చెబుతున్నాను. మా కుటుంబం శ్రేయోభిలాషులైన మీ అందరికీ ఇదే నా విన్నపం... దయచేసి మన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని బహిష్కరించండి" అని ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
అయితే, ఇది పోస్ట్ చేసిన 2 గంటల్లోనే డిలీట్ కావడం గమనార్హం. మరోవైపు భూమా అఖిలప్రియా ఖాతా మాత్రం భూమా అఖిలా రెడ్డి పేరుతో ఉండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగా అఖిలే ఈ తరహా పోస్ట్ చేశారా? లేక ఎవరైనా ప్రత్యర్థులు నకిలీ ఖాతా సృష్టించి ఈ పోస్ట్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.