సంబంధిత వార్తలు
- వర్క్ ఫ్రమ్ హోం కోసం జియో న్యూ ప్లాన్ : గూగుల్ - ఫేస్బుక్ కీలక నిర్ణయం!
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- వాట్సాప్‌లో న్యూఫీచర్.. ఇకపై గ్రూపు కాలింగ్ సదుపాయం?!
- కరోనా ఎఫెక్ట్: గూగుల్ పే నుంచి ''నియర్ బై స్పాట్'' ఎందుకంటే?
- కరోనావైరస్: కాంటాక్ట్ అయినవారిని గుర్తించేందుకు చేతులు కలిపిన గూగుల్, యాపిల్
ఇక గూగుల్ క్రోమ్‌లో డుయో కాలింగ్ సౌకర్యం.. ఒకేసారి 12మందితో..?
Google
ఒకేసారి 12 మంది వినియోగదారులు గూగుల్ వీడియో కాల్‌లో పాల్గొనవచ్చు. 24 గంటల తరువాత మీకు వచ్చిన వీడియో, వాయిస్ మెసేజ్‌లు ఆటో సేవ్ అయ్యేలా ఫ్యూచర్‌ను కల్పిస్తుంది. ప్రతి ఏడు రోజుల్లో 10 మిలియన్లు పైగా కొత్త వ్యక్తులు డుయో కోసం సైన్ అప్ చేస్తున్నారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఇప్పటివరకు స్మార్ట్ ఫోనులో వుండిన ఈ సౌకర్యం.. కరోనా వైరస్ కారణంగా దూరం దూరంగా వుంటున్న కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులకు అందుబాటులో వుండేలా.. గూగుల్ డుయోలో తాజా ఫీచర్లపై గూగుల్ ఇప్పటికే ప్రకటించింది. వారం రోజుల్లో క్రోమ్‌లో దీనికి సంబంధించిన ప్రివ్యూ ప్రారంభం కానుంది.
కొత్త లేఅవుట్‌తో పాటు వెబ్‌లో డుయో గ్రూప్‌కాంలింగ్ అందుబాటులోకి వస్తుంది. ఎక్కువమంది గ్రూప్ కాలింగ్‌కు డుయో గ్రూప్ కాలింగ్ ఉపయోగపడుతుంది. గూగుల్ అకౌంట్ ఉన్నవారు ఎవరైనా స్పేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పంపిన లింక్ ద్వారా గ్రూప్ కాల్‌లో చేరవచ్చు. గూగుల్ డ్యూయో గ్రూప్ కాలింగ్ నడుస్తున్నప్పుడు హ్యాంగ్ అవుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు.
