శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 9 మే 2020 (18:01 IST)

365 రోజులకు రోజూ 2జీబీ డేటా.. జియో ''వర్క్ ఫ్రమ్ హోమ్'' ప్లాన్

Jio
కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం రిలయన్స్ జియో సంస్థ కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఇంటి నుంచి పనిచేస్తున్న వారి డేటా డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని జియో సరికొత్త వర్క్ ఫ్రం హోం ప్లాన్‌ను విడుదల చేసింది. 
 
ప్రస్తుతం ఉన్న ప్లాన్‌కు అదనంగా రూ.2,399తో మరో దీర్ఘకాలిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని కాలపరిమితి 365 రోజులు. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే నెలకు కేవలం రూ.200తో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ పొందవచ్చన్నమాట.
 
మార్కెట్లోని ఇతర నెట్‌వర్క్‌లు ఇదే ధరకు ఇస్తున్న డేటాతో పోలిస్తే రిలయన్స్ జియో ప్రకటించిన కొత్త ఆఫర్ ద్వారా రోజుకు 0.5 జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.2,121 ప్లాన్‌లో జియో రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోన్న విషయం తెలిసిందే. దీని కాలపరిమితి 336 రోజులే.
 
అలాగే ఇంటి నుంచి పని చేస్తున్న వారి కోసం యాడ్ ఆన్ ప్యాక్స్‌ను కూడా జియో ఆఫర్ చేస్తోంది. రూ. 151, రూ. 201, రూ. 251 ప్లాన్లతో డేటా లభిస్తుంది. వీటికి డేటా పరిమితి లేదు. డేటా అయిపోతే ఏ సమయంలోనైనా రీచార్జ్ చేసుకోవచ్చు.