1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Govt puts mobile phone makers on notice over data privacy

యాపిల్ - ఒప్పో ఫోన్లు వాడుతున్నారా? ప్రమాదమే... ఎలా?

భారత మొబైల్ మార్కెట్‌ను చైనా మొబైల్స్ ముంచెత్తుతున్నాయి. అతి తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో అనేక మంది వాటిపై మొగ్గుచూపుతున్నారు.

data privacy
భారత మొబైల్ మార్కెట్‌ను చైనా మొబైల్స్ ముంచెత్తుతున్నాయి. అతి తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో అనేక మంది వాటిపై మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ ఫోన్ల వల్ల పెను ముప్పు ఉన్నట్టు కేంద్రం హెచ్చరించింది. 
 
చైనా మొబైల్ ఫోన్లు కలిగిన వినియోగదారుల పూర్తి సమాచారంతో పాటు ఫోన్‌లోని కాంటాక్ట్‌ లిస్ట్‌, మెసేజ్‌లను దొంగచాటుగా తీసేసుకోవచ్చని కేంద్రం చెపుతోంది. ఈ నేపథ్యంలోనే దిగ్గజ మొబైల్‌ సంస్థ యాపిల్ సహా షియోమీ, వివో, ఒప్పో, జియోనీ వంటి ఫోన్లకు బుధవారం ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది.
 
అంతేకాదు, ఈ వ్యవహారంలో శాంసంగ్‌, మైక్రోమాక్స్‌ వంటి మరో 21 కంపెనీలకూ నోటీసులిచ్చింది. ‘‘కంపెనీలకు 28 వరకు సమయమిస్తున్నాం. ఆలోగా వినియోగదారుల సమాచార భద్రతకు సంస్థలు తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలి’’ అని ఆ శాఖ అధికార వర్గాలు ప్రకటించాయి. కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని తేలితే భారీ జరిమానా విధిస్తామని ఓ అధికారి హెచ్చరించారు.
About Writer
pnr