1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Microsoft laying off 1,850 smartphone workers -

నోకియా కొనుగోలుతో నష్టాల ఊబిలో మైక్రోసాఫ్ట్.. 1850 మంది స్మార్ట్ వర్కర్లకు ఉద్వాసన

Microsoft
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ నష్టాల బాటలో పయనిస్తోంది. మొబైల్ తయారీ కంపెనీ నోకియాను కొనుగోలు చేయడం వల్ల ఈ కంపెనీ తీవ్ర నష్టాల్లోకి జారుకుంది. దీంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ నష్టనివారణ చర్యలు చేపట్టి.. సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా.. 1,850 మంది ఉద్యోగులపై పడనుంది. 
 
పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 950 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6300 కోట్లు)ను కంపెనీ వెచ్చించనుంది. ఇందులో 200 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1300 కోట్లు) చెల్లింపులకు సంబంధించినవే. 
 
ఫిన్లాండ్‌లోని మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌ ఓయ్‌ కేంద్రంలో 1,350 మంది ఉద్యోగులు (స్మార్ట్ ఫోన్ వర్కర్లు), ప్రపంచవ్యాప్తంగా మరో 500 మంది ఉద్యోగులకు కంపెనీ ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది చివరి నాటికి పాక్షికంగా.. 2017 జులై నాటికి పూర్తిగా ఉద్యోగుల తొలగింపు పూర్తవుతుందని కంపెనీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
About Writer
pnr
తర్వాతి కథనం
దేశ వ్యాప్తంగా ప్రారంభమైన నీట్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తులు