1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. No documents required to change these 5 things in your Aadhaar card

ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయాలా? డాక్యుమెంట్లు అవసరం లేదట..

No documents
Aadhaar card
సాధారణంగా ఆధార్ కార్డులో వివరాలు అప్ డేట్ చేయాలంటే.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వుంటుంది. అయితే కొన్ని వివరాలు అప్‌డేట్ చేయడానికి అసలు డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీరు నేరుగా ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్‌గా ఇవ్వకుండా ఆధార్ వివరాలు అప్‌‌డేట్ చేయొచ్చు. ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వీటిపై క్లారిటీ ఇచ్చింది.
 
డాక్యుమెంట్స్ లేకుండా ఏ వివరాలను అప్‌డేట్ చేయొచ్చో ట్విట్టర్‌లో తెలిపింది. ఆధార్ కార్డులో ఫోటోగ్రాఫ్, బయోమెట్రిక్స్, జెండర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ అప్‌డేట్ చేయడానికి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 
 
కేవలం మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్తే చాలు. మీ వివరాలు అప్‌డేట్ చేయించుకునే వీలుంటుంది. ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా అడ్రస్ అప్‌డేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది యూఐడీఏఐ. కానీ మీ వివరాలు అప్‌డేట్ చేయించాలంటే ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే స్లాట్ బుక్ చేసుకోవచ్చునని యూఐడీఏఐ తెలిపింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏపి బిజేపికి సోషల్ మీడియా టెన్షన్, సోము వీర్రాజుపైన పోస్టులు