ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:28 IST)

ఫుడ్ డెలివరీ మాత్రమే కాదు.. ఇక ఆ పనులూ చేస్తాం.. స్విగ్గీ

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇకపై చిన్న చిన్న పనులు కూడా చేసేందుకు సై అంటోంది. ఫుడ్ డెలివరీ సంస్థల్లో అగ్రగామి అయిన స్విగ్గీ ''స్విగ్గీ గో'' పేరిట కొత్త యాప్‌ను ప్రారంభించింది. కస్టమర్లను పెంచుకునేందుగాను.. స్విగ్గీ సంస్థ చిన్న చిన్న పనులు చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది. ఇందుకోసం స్విగ్గీ గో అనే యాప్‌ను ప్రారంభించింది. 
 
దీనిద్వారా కస్టమర్లకు పార్సిల్స్ పంపడం, ఇంటి నుంచి లంచ్ బాక్సులను ఉద్యోగులను అందివ్వడం, దుస్తుల్ని ఐరనింగ్ ఇవ్వడం వంటి సేవలను పొందవచ్చు. బిగ్ యాప్, డ్రాప్ సేవల పేరిట ప్రారంభమైన ఈ యాప్‌ను మొట్టమొదటి సారిగా బెంగళూరు నగరంలో ప్రారంభించడం జరిగింది. 
 
ఆపై 2020 లోపు ఈ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేదిశగా స్విగ్గీ రంగం సిద్ధం చేసుకుంటోంది. తొలి విడతగా 300 నగరాలకు ఈ సేవలను అందించాలని స్విగ్గీ భావిస్తోంది. ఇంకా స్విగ్గీ స్టోర్స్ ద్వారా ఇంటికి అవసరమైన కిరాణా వస్తువులు, మందులు, పువ్వులను కూడా అందించనుంది.