శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (11:39 IST)

స్విగ్గీ బాయ్‌గా వుండి.. బీర్ బాటిల్ సప్లై చేస్తావా?

గుజరాత్ రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం వుంది. అలాంటిది ఓ స్విగ్గీ బాయ్ కస్టమర్ల కోసం బీర్ బాటిల్ కొని పెట్టుకుని అడ్డంగా బుక్కయ్యాడు. స్విగ్గీ బాయ్ బైకును, మొబైల్ ఫోనును పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం వడోదరలో రాహుల్ సింగ్ మహీదా అనే 22 ఏళ్ల కుర్రాడు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్న యువకులు ఆహారంతో పాటు బీర్ బాటిల్‌ని స్విగ్గీ బాయ్‌తో పట్టుకొచ్చేయమన్నారు. స్విగ్గీ బాయ్ కూడా సరేనని ఆరు మందు బాటిల్స్ కొని బ్యాగులో వేసుకున్నాడు. 
 
కానీ తీసుకున్న ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళుతూ పోలీసులకు దొరికిపోయాడు. ఇలా బీరు కూడా చాలా సార్లు సప్లై చేశాడని విచారణలో తేలింది. డబ్బులు ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. ఆర్డర్ చేసిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు.