సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2019 (09:16 IST)

పుస్తకం కొనుక్కునేందుకు వెళితే... గట్టిగా వాటేసుకుని ముద్దుపెట్టిన సేల్స్‌మెన్

కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ పట్టణంలో ఓ యువతి ఊహించని సంఘటన ఎదురైంది. పుస్తకం కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఆ యువతిని ఉన్నట్టుండి దగ్గరకు లాక్కొని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు ఆ షాపులో పని చేసే సేల్స్‌మెన్. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, త్రిసూర్‌ సమీపంలోని సావక్కాడుకు చెందిన మునీర్‌ (35), గత 20 ఏళ్లుగా కోయంబత్తూరు సమీపంలోని కారమడైలో ఉన్న ఓ స్టోరులో పని చేస్తున్నాడు. 
 
అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొంటున్న ఓ విద్యార్థిని ఓ పుస్తకం కొనుగోలు చేసేందుకు షాపుకు వెళ్లింది. ఆ షాపులో పని చేసే మునీర్ అనే ఓ యువకుడు ఆమెను ఉన్నట్టుండి దగ్గరకు లాక్కొని గట్టిగా వాటేసుకుని ముద్దుపెట్టాడు. 
 
ఊహించని సంఘటనతో నివ్వెరబోయిన ఆ యువతి... అతని నుంచి తప్పించుకుని షాపు నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత జరిగిన విషయం తన తల్లికి వివరించింది. ఆ తర్వాత కారమడై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మునీర్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.