సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (18:06 IST)

'దొరసాని'లో ముద్దు సీన్‌ను అలా తీశా : కేవీఆర్ మహేంద్ర

టాలీవుడ్ సీనియర్ హీరోహీరోయిన్లు జీవితా రాజశేఖర్ దంపతుల ముద్దుకుమార్తె శివాత్మిక. ఈమె నటించిన తొలి చిత్రం దొరసాని. ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం నిర్మాతలకు కూడా మంచి లాభాలే తెచ్చిపెట్టింది. 
 
ఇదే అంశంపై కేవీఆర్ మహేంద్ర స్పందిస్తూ, 'ఈ సినిమాలో శివాత్మిక .. ఆనంద్ దేవరకొండ మధ్య ముద్దు ఒకటి వుంది. ఆ సీన్ ఉంటుందని నేను స్క్రిప్ట్ చదివి వినిపించేటప్పుడే చెప్పాను. జీవితగారు - రాజశేఖర్ గారు ఇద్దరు కూడా ప్రొఫెషనల్‌గానే ఆలోచిస్తారు. అందువలన వాళ్లేమీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదని చెప్పారు. 
 
కానీ, ఈ సీన్‌కి నేను ఏ యాంగిల్ పెడతాను.. ఎలా డీలా చేస్తానా? అనే ఒక సందేహం జీవితగారికి వచ్చిందన్నారు. అందుకే ఆ సీన్‌ను ఆ రాత్రికి తీస్తామనగా, ఆ సాయంత్రం ఆమె నాకు కాల్ చేశారు. అప్పుడు నేను 'మేడమ్ మీరు కంగారు పడకండి .. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా డీల్ చేస్తానో అలా డీల్ చేస్తానని ఆమెకి నేను భరోసా ఇచ్చాను' అని చెప్పుకొచ్చారు.