సంబంధిత వార్తలు
- 108 కోట్ల ఓం నమో వెంకటేశాయ నామ లిఖిత యజ్ఞం ప్రారంభం..విజయవాడలో కనులపండువగా ప్రారంభం
- తీరప్రాంత రక్షకులుగా 177 మంది కేరళ మత్స్యకారులు..
- యంగ్ హీరోయిన్‌తో కుమారి 21 ఎఫ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సుక్కూ..! (video)
- రష్మిక మందన అంత తీసుకుంటోందా? (video)
- ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా మోదుగుల... విజయసాయిరెడ్డి తొలగింపు...
ఈ స్థాయిలో ఉండటానికి కారణం తమ్ముడే: విజయ్ దేవరకొండ కంటతడి
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ ‘దొరసాని’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ తన తమ్ముడి గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కథానాయికగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మరో ముఖ్య అతిథిగా రాజశేఖర్ కూడా నటించారు.
అమెరికా దేశంలోని డెలాయిట్‌లో ఆనంద్ పని చేసేవాడు. సినిమాల్లో నటించాలనే కోరిక తనకు ఉన్నట్లు, అందుకోసం ఇండియాకు వచ్చేస్తానని చెప్పడం నాకు వచ్చలేదు. అందుకే మంచి కథలను ఎంచుకునే సామర్థ్యం వాడికి రావాలనే ఉద్దేశ్యంతో సినిమాలలోకి వస్తే నా సాయం లేకుండా ఒంటరిగా కష్టపడాలని చెప్పాను.
ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ నాకు డబ్బు పంపడం వల్లనే నాకు సాధ్యమైంది. ఇక ఆనంద్ సినిమా గురించి నన్ను ఎవరైనా అడిగితే నాకేమీ తెలీదని చెప్పేవాడిని, వాడి సినిమా పూజ కార్యక్రమానికి కూడా నేను రాలేకపోయాను.
నెటిజన్ల నుండి వచ్చే ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆనంద్ సినిమా కోసం ప్రచారం చేయలేదు. ‘దొరసాని’ సినిమా చూశాను. చాలా బాగుంది. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం, అలాగే శివాత్మిక, ఆనంద్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు’ అంటూ కంటతడి పెట్టారు విజయ్.
తర్వాతి కథనం
