1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Can pregnant women eat beetroot or not?

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

Beetroot juice
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది.
 
ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి. ఐతే గర్భిణీలు బీట్‌రూట్ తినడం వల్ల కడుపులో వున్న బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేస్తుంది. బీట్‌రూట్ లోని ఫోలేట్ బిడ్డ మెదడు, వెన్నుపాము అభివృద్ధికి దోహదం చేస్తుంది. రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. వీటిలో వుండే నైట్రేట్లు రక్తనాళాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
 
బీట్‌రూట్ లోని ఫైబర్ వల్ల మలబద్ధక సమస్య తొలగుతుంది. ఐతే గర్భిణీ స్త్రీలు మితంగా మాత్రమే తీసుకోవాలి. రోజుకి ఒక్క చిన్న బీట్రూట్ తీసుకోవచ్చు అంటే ఓ అరకప్పు మించి తీసుకోరాదు. వీటిని తినేటప్పుడు వాటిని బాగా శుభ్రంగా కడిగి తినాలి. లేదంటే అందులోని బ్యాక్టీరియా లేదా పురుగుమందుల అవశేషాలు జీర్ణక్రియకు ఇబ్బంది పెట్టవచ్చు. బీట్రూట్లో ఆక్సలేట్లు అధికంగా వుంటాయి కనుక మోతాదుకి మించి తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం వుంది.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026: ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా.. థీమ్ ఇదే..