శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (14:57 IST)

సింహాన్ని వేటాడి చంపేశారు.. లిప్ లాక్ ఇచ్చుకున్నారు.. ఫోటో వైరల్

సింహాన్ని వేటాడిన ఓ యువజంట.. అంతటితో ఆగకుండా.. సింహపు శవాన్ని ముందు పెట్టుకుని వెనుక వైపు లిప్ లాక్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో యాత్రికులను ఆకట్టుకునే రీతిలో సఫారీ అనే అటవీ ప్రాంతం వుంది. ఇక్కడ మృగాలను వేటాడటం చేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో కెనడాకు చెందిన ఓ యువజంట డేరన్-కార్లోన్.. వేట కోసం సఫారీ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వేటాడే పోటీలో సింహాన్ని కాల్చి చంపేశారు. ఇంకా ఆ సింహపు మృతదేహానికి పక్కనే కూర్చుకుని ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తపరిచే రీతిలో లిప్ లాక్ చేశారు. 
 
ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోను చూసిన వారంతా ఆ యువ జంటను తిట్టిపోస్తున్నారు. ఇంకా #StopLionHunting అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ అవుతోంది.