శీతలపానీయంలో నిద్రమాత్రలు కలుపుకుని...

suicide
ఎం| Last Updated: గురువారం, 11 జులై 2019 (13:28 IST)
శీతలపానీయంలో నిద్రమాత్రలు వేసుకుని పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబం చేసుకుంది. హైదరాబాద్ నగరంలో అంబర్‌పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో పంజాబీకి చెందిన కుటుంబం కూల్డ్రింక్‌లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇద్దరినీ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులను పవన్ (65), భార్య నీలం (55)లుగా గుర్తించారు. అలాగే పిల్లలను మన్ను (34),
నిఖిల్ (30)గా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.దీనిపై మరింత చదవండి :