శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (09:55 IST)

సకాలంలో సర్వ్ చేయలేదని కస్టమర్ ఫైర్.. సలసల కాగే నూనెను పోసిన కుక్

తాను ఇచ్చిన ఫుడ్ ఆర్డర్‌ను సకాలంలో సర్వ్ చేయలేదని ఓ కస్టమర్ మండిపడ్డారు. ఈ విషయాన్ని సర్వర్ వంటమనిషి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ కుక్ ఆగ్రహంతో ఊగిపోతూ సలసల కాగే నూనెను కస్టమర్ ముఖంపై పోశాడు. దీంతో అతని ముఖమంతా కాలిపోయింది. ఈ ఘటన హైదరాబాద్, పాతబస్తీలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాతబస్తీకి చెందిన మహ్మద్ బిన్ బక్షాది అనే వ్యక్తి చాంద్రాయణగుట్టలోని ఓ హోటల్‌కు వెళ్లి, తనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డరిచ్చాడు. ఎంతసేపైనా సర్వర్ తెచ్చివ్వక పోవడంతో కస్టమర్ మండిపడ్డారు. ఈ విషయం కుక్ దృష్టికి వెళ్లడంతో అతను వచ్చి కస్టమర్‌తో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరి మధ్యా మాటామాటా పెరిగి, ఇద్దరూ అసభ్యకరమైన రీతిలో దూషించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో, బక్షాది అక్కడి నుంచి వెళ్లిపోయి మరో నలుగుర్ని వెంటేసుకుని వచ్చాడు. తనపై దాడికి దిగే ప్రయత్నం చేయగా, కుక్ బాండీలో మరుగుతున్న నూనెను బక్షాది ముఖాన విసిరికొట్టాడు. దాంతో ఆ కస్టమర్ మెడ, చేతులపైనా నూనె పడడంతో గాయాలయ్యాయి. దీనిపై బక్షాది పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.