మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (10:58 IST)

వన్‌ప్లస్ నుంచి తక్కువ బడ్జెట్‌లో మరో రెండు స్మార్ట్ ఫోన్లు

OnePlus Nord
వన్‌ప్లస్ నుంచి తక్కువ బడ్జెట్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్ భారత మార్కెట్లోకి రానున్నాయి. ఇటీవల రూ.30,000 లోపు వన్‌ప్లస్ నార్డ్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌కు బాగా హైప్ వచ్చింది. అయితే ఇండియాలో ధర కాస్త ఎక్కువన్న అభిప్రాయం కూడా వినిపించింది. అందుకే కాస్త తక్కువ ధరతో కొత్త ఫోన్లను రిలీజ్ చేయనుంది వన్‌ప్లస్. 
 
ఈ నేపథ్యంలో ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ భారత మార్కెట్లో రూ.20,000 లోపు, రూ.10,000 లోపు రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక ఫోన్ ధర కూడా రూ.16,000 నుంచి రూ.18,000 మధ్య, మరో ఫోన్ ధర రూ.10,000 లోపే ఉండొచ్చని అంచనా.
 
2015లో తొలిసారి వన్‌ప్లస్ రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత అన్నీ ప్రీమియం ఫోన్లనే తీసుకొచ్చింది. ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై దృష్టిపెట్టింది. రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 665 లేదా స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 4జీబీ ర్యామ్ లాంటి ఫీచర్స్ ఉండే అవకాశముంది.
 
ఇక రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంటుందని అంచనా. భారత్‌లో రూ.20,000 లోపు బడ్జెట్లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ చివరి నాటికి వచ్చే అవకాశముంది. ఇది వన్‌ప్లస్ నార్డ్ లైట్ పేరుతో రావొచ్చని సమాచారం.