శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జులై 2020 (12:00 IST)

జియోనీ సంచలనం: ఫుల్ ఛార్జ్ చేస్తే 2,3 రోజులకు ఛార్జింగ్ అవసరం లేదు..

Gionee
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను 20 నిమిషాల్లో 100 పర్సెంట్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీని రియల్‌మీ రూపొందించింది.

6,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు శాంసంగ్ రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు జియోనీ సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కనీసం మూడు నాలుగు రోజులు ఛార్జింగ్ అవసరం లేకుండా వాడుకోవచ్చు. 
 
ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది జియోనీ. ఇంత భారీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ రావడమంటే సంచలనం. ఇప్పటికే ఔకిటెల్ కే 10000 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా ఇంత బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు జియోనీ నుంచి 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఇప్పటికే చైనాలో అప్రూవల్ లభించింది.
 
ఇక ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ చూస్తే మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ, 5.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 16మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఆగస్టులో ఈ ఫోన్ లాంఛ్ అయ్యే అవకాశముంది.